అమ్మాయిలు.. సోలోగా ట్రిప్ వేస్తున్నారా.. ఈ టిప్స్ మీ కోసమే..
10 August 2023
సోలో ట్రిప్ వెళ్లాలనుకునే అమ్మాయిలు తమ ప్రయాణానికి మార్గమధ్యంలో ఎదురయ్యే అనుకోని సమస్యలను తేలికగా అధిగమించవచ్చు.
ప్రయాణానికి ముందే వెళ్ళాలనుకున్న గమ్యస్థానాన్ని నిర్ణయించుకుని, అక్కడ ఆహార, వసతి, రవాణా సౌకర్యాల గురించి తెలుసుకోండి.
ఇలా చేయడం వల్ల ట్రిప్ ఎలాంటి ఆటంకం లేకుండా హ్యాపీగా సాగుతుంది. లేదంటే లేనిపోని ఇబ్బందుల బారిన పడాల్సి వస్తుంది.
సోలో ట్రిప్‌కి వెళ్లేవారు తమతో రెండో ఫోన్‌గా చిన్న కీపాడ్ మొబైల్‌ని తీసుకెళ్లడం మంచిది. స్మార్ట్‌ఫోన్‌లో ఛార్జ్ లేకపోయినా చిన్న ఫోన్‌లో చార్జింగ్ ఎక్కువ సమయం ఉంటుంది.
అత్యవసర పరిస్థితుల్లో ఇతరులకు కాల్ చేయడానికి చిన్న ఫోన్ ఉపయోగపడుతుంది. ఇది మీ కమ్యూనికేషన్ కోసం మంచి పద్దతి.
ముఖ్యంగా సోలో ట్రిప్‌ని ఆస్వాదించేందుకు మీరు భారీగా లగేజ్ ప్యాక్ చేసుకోకండి. వాటిని మోయడానికే సమయం సరిపోతే ట్రిప్‌ని ఆస్వాదించలేరు
అలాగే సోలో ట్రిప్‌లో ఎక్కడకు వెళ్లినా డెబిట్, ఐడీ కార్డులను తప్పక మీతోనే తీసుకెళ్లండి. ఇంకా లిక్విడ్ క్యాష్‌ని తీసుకెళ్లడం మర్చిపోకండి.
అన్నింటికంటే ముఖ్యంగా ఎప్పటికప్పుడు మీ లోకేషన్‌ని కుటుంబ సభ్యులకు తెలియజేస్తే అవాంతరాల సమయంలో వారికి మిమ్మల్ని చేరుకోవడానికి ఉపయోగపడుతుంది.