ప్రపంచంలో ఉన్న తాజ్‌మహల్ ప్రతిరూపాలు ఇవే..
TV9 Telugu
06 October 2024
మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన తాజ్ మహల్ మొఘల్ యుగాన్ని గుర్తు చేస్తుంది. తాజ్‌మహాల్ ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటి.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో బీబీ కా మక్బరా. ఇది ఔరంగజేబు కుమారుడు ప్రిన్స్ ఆజం ఖాన్ తన సామ్రాజ్ఞి-తల్లి రబియా-ఉద్-దౌరానీ జ్ఞాపకార్థం నిర్మించాడు.
యూకేలోని రాయల్ పెవిలియన్ భవనం బ్రిటిష్ స్మారక చిహ్నం. ఇది ఆగ్రాలోని మన తాజ్ మహల్‌కు దగ్గరి పోలికను కలిగి ఉంటుంది.
దుబాయ్‌లోని తాజ్ అరేబియా ఆగ్రాలోని అసలు తాజ్ మహల్ కంటే నాలుగు రెట్లు పెద్దది. ఇది 210000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.
హుమాయున్ సమాధి తాజ్ మహల్ కంటే పురాతనమైనది. తాజ్ మహల్ లేఅవుట్, డిజైన్ హుమాయున్ సమాధి నుండి ప్రేరణ పొందింది.
బిల్ హర్లాన్ 1970ల మధ్యకాలంలో భారతదేశాన్ని సందర్శించి కాలిఫోర్నియాకు తిరిగి వెళ్లి తాజ్ మహల్ హౌస్‌బోట్‌ను నిర్మించారు.
చైనా తాజ్ మహల్ వెర్షన్‌ను నిర్మించింది. షెన్‌జెన్‌లోని థీమ్ పార్క్ వద్ద ఉన్న ఈ నిర్మాణాన్ని విండో టు ది వరల్డ్ అని కూడా పిలుస్తారు.
బంగ్లాదేశ్‌లోని తాజ్ మహల్ రాజధాని ఢాకాలో ఉంది. అసలు తాజ్ మహల్ ఈ పూర్తి స్థాయి కాపీని బంగ్లాదేశ్ చిత్రనిర్మాత అహ్సానుల్లా మోని నిర్మించారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి