29 September 2023

ఖాళీ సమయంలో ఏం చెయ్యాలో ఇలా ప్లాన్ చేసుకోండి..!

ఖాళీ సమయం దొరకడం ఒక బహుమతి లాంటిది. మనం కష్టపడి పని చేస్తేనే విరామాన్ని కూడా అంతే ఆనందంగా గడపగలం.

విరామ సమయాన్ని ఎలా గడపాలో ఆలోచిస్తూ చాలామంది ఒత్తిడికి గురవుతూ ఉంటారట

ఈ ఒత్తిడి అసలైన ఆనందాన్ని చంపేస్తుందని ఈ అంశంపై అధ్యయనాల కోసం సేకరించిన డేటా చెబుతోంది.

కొంతమంది జీవితంలో విరామం తీసుకోవడాన్ని ఉపయోగకరమైన పనిగా భావించరు. 

సాధారణంగా ఎక్కువ ఒత్తిడికి గురయ్యే, అధిక ఆదాయం సంపాదించే వారు, పనికే ప్రాధాన్యత ఇస్తూ విరామ సమయాన్ని కూడా ఆనందంగా గడపలేరు.

మంచి హోటళ్లు, ఐమ్యాక్స్, నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు చూడటం లాంటివి చేస్తూ, ప్రతీదీ ఉత్తమంగా ఉండాలని అనుకుంటారు 

కొన్నిసార్లు మనం పెట్టుకున్న అంచనాలు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉంటాయి.

దురదృష్టవశాత్తూ  విరామం తీసుకోవడాన్ని సగటున 30శాతం ప్రపంచ జనాభా పనికిరాని దానిగానే చూస్తోందని అధ్యయనాలు చెప్తున్నాయి.