మమ్మీలను ఈజిప్ట్‌లోనే కాదు భారత్‌లో కూడా చూడవచ్చు తెలుసా.. 

07 November 2023

మమ్మీ అంటే ఈజిప్టు గుర్తుకొస్తుంది. అయితే వీటిని చూడాలంటే ఈజిప్టు వెళ్లాల్సిన అవసరం లేదు.  భారతదేశంలో కూడా నిజమైన మమ్మీలను డైరెక్ట్ చూడవచ్చు. 

భారత్ లో మమ్మీలు 

కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్‌లో ఉన్న ఇండియన్ మ్యూజియంలో మీరు 4000 సంవత్సరాల పురాతన ఈజిప్షియన్ మమ్మీని చూడవచ్చు. దీనిని శవపేటికలో భద్రపరిచారు. టచ్ చేయడానికి అనుమతి లేదు   

కోల్‌కతాలో మమ్మీ

ముంబైలోని ఛత్రపతి శివాజీ వాస్తు మ్యూజియంలో 20వ శతాబ్దం ప్రారంభం నుండి 2500 సంవత్సరాల నాటి మమ్మీని సందర్శనార్ధం ఉంచారు. 

ముంబయిలో మమ్మీ

హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో 2500 BC నాటి మమ్మీ కూడా ఉంది. ఇది ఈజిప్టు ఆరవ ఫారో కుమార్తె నసీహుది. ఇది నాలుగు భాగాలుగా విభజించబడింది. 

హైదరాబాద్‌లో మమ్మీ

యూపీలోని లక్నోలో ఉన్న స్టేట్ మ్యూజియంలో సుమారు 3000 సంవత్సరాల నాటి మమ్మీ ఉంది. ఇది 13 ఏళ్ల బాలికగా చెప్పబడుతుంది. 

లక్నోలో మమ్మీ

వడోదర మ్యూజియంలో టోలెమీ II కాలం నాటి మహిళ మమ్మీని చూడవచ్చు.  దీనిని సాయాజీరావు గైక్వాడ్ III 1895లో న్యూయార్క్ మ్యూజియం నుండి $175కి కొనుగోలు చేశారు.  

వడోదరలో మమ్మీ

జైపూర్ మ్యూజియంలోని ఆల్బర్ట్ హాల్‌లో టుటు అనే మహిళ మమ్మీని చూడవచ్చు. ఇది ఈజిప్ట్‌లోని అఖ్మీమ్ ప్రాంతంలోని పిరమిడ్ లో కనుగొన్నారు. 

జైపూర్ లో మమ్మీ