ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు షురూ.. ఏ రూట్లలో అంటే!

21 September 2023

భాగ్యనగరం రోడ్లపై పరుగులు పెట్టేందుకు 25 ఎలక్ట్రిక్ బస్సులు సిద్ధమయ్యాయి. పర్యావరణం పరిరక్షణతో పాటు కాలుష్య నివారణలో భాగంగా రోడ్డెక్కిన కొత్త ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు.

గచ్చిబౌలిలో కొత్త ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను  మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఎండీ సజ్జనర్‌ ప్రారంభించారు.

వేవ్‌రాక్, బాచ్‌పల్లి, సికింద్రబాద్, కొండాపూర్, మియాపూర్, శంషాబాద్, జేబీఎస్, హైటెక్ సిటీ, ఎల్బీ‌నగర్ మధ్య ఏసీ బస్సులు.

సీసీ కెమెరాలు, మొబైల్స్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ సదుపాయం వంటి అధునాతన సౌకర్యాలు ఏసీ ఎలక్ట్రిక్ బస్సులో సమకూర్చారు.

ప్రయాణికుల సంక్షేమమే ధ్యేయంగా 550 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్‌లో నడపాలని నిర్ణయించిన టీఎస్ఆర్టీసీ.

ఐటీ కారిడార్‌తో పాటు హైదరాబాద్ శివారులోని కోకాపేట, ఎల్బీ నగర్‌లను కలుపుతూ.. హైదరబాద్ చుట్టూ బస్సుల నడపాలని నిర్ణయం.

ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్ మెట్రోతో అనుసంధానం చేయాలని భావిస్తున్న టీఎస్ఆర్టీసీ. ప్రస్తుతం ఇందులో 35 సీట్ల సామర్ధ్యం. భవిష్యత్తులో సీటింగ్ కెపాసిటీ పెంచేలా చర్యలు తీసుకుంటున్న టీఎస్ఆర్టీసీ.

తెలంగాణలోని కోటి 52 లక్షల వాహనాలను ఎలక్ట్రిక్ వెహికల్స్‌ దిశగా మార్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేసిన సర్కార్.