కశ్మీర్ ఇందిరాగాంధీ స్మారక తులిప్ గార్డెన్‌కు అరుదైన రికార్డు..
21 August 2023
జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉన్న ఇందిరాగాంధీ స్మారక తులిప్ గార్డెన్ ఆసియా ఖండంలోనే అతిపెద్దది.
30 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ తులిప్ గార్డెన్‌లో 68 రకాలకు చెందిన 1.5 మిలియన్ల తులిప్ పుష్పాలు ఉన్నాయి.
దీనిని చూడడానికి దేశవిదేశాలనుంచి పర్యాటకులు వచ్చి ఈ తులిప్ గార్డెన్ అందాలను ఆస్వాదించి వెళ్తుంటారు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో నగరాల్లో తులిప్ పుష్పాల ఉద్యానవనాలు ఉన్నా దీనికి మాత్రం ఓ ప్రత్యేక స్థానం ఉంది.
ఇదిలాఉంటే తాజాగా శనివారం ఈ భారతీయ తులిప్ గార్డెన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.
ఈ మేరకు ఫ్లోరికల్చర్, గార్డెన్స్ అండ్ పార్క్స్ కమిషనర్ సెక్రటరీ షేక్ ఫయాజ్ అహ్మద్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధ్యక్షుడు సంతోష్ శుక్లా.. గుర్తింపు పత్రాన్ని అందించారు.
ఈ మేరకు జరిగిన కార్యక్రమంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిటర్ దిలీప్ ఎన్ పండిత్, కశ్మీర్ అధికారులు పాల్గొన్నారు.
కాశ్మీర్ లోయలో పూల పెంపకం మరియు పర్యాటకాన్ని పెంచే లక్ష్యంతో ఈ తులిప్ గార్డెన్ 2007లో ప్రారంభించబడింది.