హనీమూన్ ప్లాన్ ఉందా.? ఇవి ది బెస్ట్.. 

04 April 2025

TV9 Telugu

ఉదయపూర్, రాజస్థాన్: ఇక్కడ రాజభవనాలు, మెరిసే పిచోలా సరస్సు, వారసత్వ సౌందర్యాన్ని చూడవచ్చు. పడవ ప్రయాణం, సూర్యాస్తమయ దృశ్యాలను ఆస్వాదించవచ్చు.

మున్నార్, కేరళ: తేయాకు తోటలు, పొగమంచు కొండలు, జలపాతాలను చూడవచ్చు. తేయాకు ఎస్టేట్ల మధ్య వాకింగ్, సరసమైన హోమ్‌స్టేలు ఇక్కడ ప్రసిద్ధి.

పాండిచ్చేరి: ఇక్కడ ఫ్రెంచ్ వలసరాజ్యాలు ప్రత్యక ఆకర్షణ. ప్రశాంతమైన బీచ్‌లు, ఫ్రెంచ్ క్వార్టర్, రాక్ బీచ్‌లను చూడవచ్చు.

అల్లెప్పీ, కేరళ: కానో రైడ్‌ల ద్వారా అల్లెప్పీ బ్యాక్ వాటర్‌ ప్రయాణం అద్భుతం. సుందరమైన దృశ్యాలు, హాయిని అనిపించే హోమ్‌స్టేలు మరారి బీచ్‌ వంటివి ఆకర్షిస్తాయి.

డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్: టీ తోటలు, పర్వతాలు, వలసరాజ్యాల ఇక్కడ ఆకర్షణ. టైగర్ హిల్ అద్భుతమైన సూర్యోదయం వీక్షించవచ్చు.

జైపూర్, రాజస్థాన్: ఈ ప్రదేశం కోటలు, ఉత్సాహభరితమైన మార్కెట్లు, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్‌కు ప్రసిద్ధి. ఇక్కడ హెరిటేజ్ హోటళ్ళు రాజ అనుభూతిని అందిస్తాయి.

కూర్గ్, కర్ణాటక: అబ్బే జలపాతాలు, సుగంధ ద్రవ్యాల తోటలను సందర్శించవచ్చు. చిరస్మరణీయమైన శృంగార విహారయాత్రకి ప్రసిద్ధి.

హంపి, కర్ణాటక: రాయల కాలంనాటి విరూపాక్ష, యంత్రోద్ధారక హనుమాన్ ఆలయాలతో పాటు అనేక అద్భుత శిధిల ఆలయాలను, సూర్యాస్తమయం ఇక్కడ వీక్షించవచ్చు.