సుందరమైన బీచ్‌లు, చల్లని గాలులు, ఆహ్లాదకరమైన వాతావరణం లక్షద్వీప్ ప్రత్యేకత. ఇక్కడి నీలి రంగు సముద్ర జలాలు పర్యాటకులను మరింత ఆకట్టుకుంటాయి.
అరేబియా సముద్రంలో ఉండే లక్షద్వీప్ అనేది 36 దీవుల సముదాయం. 1956లో ఈ దీవులను కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు. 1973లో వీటికి ‘లక్షద్వీప్’ అనే పేరు పెట్టారు.
లక్షద్వీప్‌ను సందర్శించాలంటే కనీసం రెండు మూడు రోజులు కావాలి. ఐదు రోజుల పర్యటనలో లక్షద్వీప్‌ను హాయిగా అన్వేషించవచ్చు.
ల్లక్షద్వీప్‌లో తప్పక చూడవలసిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ దిగగానే.. భూతల స్వర్గంలో అడుగుపెట్టినట్లుగా ఉందంటున్నారు వెళ్లి వచ్చిన పర్యాటకులు..
లక్షద్వీప్‌కు వెళ్లొందుకు సెప్టెంబర్ నుంచి మార్చి అనువైన సమయం అని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు. కొంత మంది మార్చి నుంచి జూన్ మధ్య కూడా వెళ్తుంటారు.
లక్షద్వీప్‌లో పర్యటించేందుకు వివిధ టూరిస్ట్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా 3 నుంచి 6 రోజులకు గాను ఈ ప్యాకేజీలు ఉంటాయి. కోచి నుంచి మొదలవుతుంది.
బెంగుళూరు నుండి అగట్టి ఏరోడ్రోమ్ విమానాశ్రయానికి వెళ్లడం ద్వారా ఈ ద్వీపానికి చేరుకోవచ్చు. అనేక ప్రధాన విమానయాన సంస్థలు బెంగళూరు నుండి లక్షద్వీప్‌కు విమానాలను నడుపుతున్నాయి.