కుర్రాళ్లు వీక్ టూర్ ప్లాన్ ఉందా.? హంపి బెస్ట్ ఆప్షన్..
TV9 Telugu
02 October 2024
1336 నుండి 1565 వరకు శ్రీకృష్ణ దేవరాయల సామ్రాజ్యానికి రాజధానిగా ఉంది హంపి. ఆ కాలంలో దీని విజయనగరంగా పిలిచేవారు.
రామాయణ కాలంలో కిష్కిందగా ఉన్నది కూడా ఈ ప్రదేశమే. అయితే హంపిలో చూడవలసిన ప్రదేశంలో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హంపి అనగానే మొదటిగా చూడవలసింది విరూపాక్ష టెంపుల్. శివునిపై భక్తితో రాయల వంశీకులు ఈ ఆలయాన్ని నిర్మించారు.
హంపిలో సందర్శించదగిన పురాతన ప్రదేశాలలో విజయ విట్టాల దేవాలయం ఒకటి. ఇక్కడ స్తంభాలు సంగీతాన్ని ప్లే చేస్తున్నట్లుగా కనిపిస్తాయి.
యంత్రోధారక హనుమాన్ ఆలయం కొండ శిఖరం వద్ద ఉన్న గుహలో హనుమంతుడి పూజలు అందుకుంటున్నారు. ఇది రామాయణ నాటిదిగా చెబుతారు.
క్వీన్స్ బాత్ విజయనగరం యొక్క నిర్మాణ నైపుణ్యానికి ఉదాహరణ. ఇది రాయల కాలంలో రాణులు స్నానం చేయడానికి నిర్మించారు.
హంపిలో చూడదగిన అన్ని ప్రదేశాలలో మాతంగ కొండ గురించి మాట్లాడతారు. ట్రావెల్ ఫోటోగ్రాఫర్‌లకు ఇది ఒక సుందరమైన గమ్యస్థానం.
మోనోలిత్ బుల్ లేదా నంది పురాతన వాస్తుశిల్పం, ఇది రెండు అంతస్తుల పెవిలియన్‌లో ఉంది. ఈ భారీ కట్టడం ప్రసిద్ధ విరూపాక్ష ఆలయానికి ఎదురుగా ఉంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి