30 August 2023

తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్.. ఇలా ట్రై చేయండి.!

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం చేసేలా అదిరిపోయే ఆఫర్ మీ ముందుకి వచ్చింది.

తక్కువ ఖర్చుతో విమానయానం చేసేందుకు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి గూగుల్ ఫ్లైట్స్ పేరుతో  గూగుల్ తీసుకొచ్చింది.

విమాన టికెట్ ధరలతో పాటు బుకింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలతో అలర్ట్ చేసేలా ఏర్పాటు చేస్తుంది. 

విమాన ప్రయాణికులు తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఈ ఫీచర్ సాయపడుతుందంటోంది అంటుంది గూగుల్.

ప్రయాణించాల్సిన రూట్స్‌కు సంబంధించి ఏ సమయంలో తక్కువ రేట్స్‌తో టికెట్స్ దొరుకుతాయన్నదీ సమాచారం ఇస్తుంది.

టికెట్స్ ధరలతో పాటు బుకింగ్ సంబంధించిన అయా ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా పొందుపర్చింది గూగుల్.

విమాన ప్రయాణికుల కోసం తీసుకొచ్చిన ఈ సరికొత్త ఫీచర్‌కు ‘గూగుల్ ఫ్లైట్స్’ గా నామకరణం చేశారు. ఇదెలా ఉపయోగపడుతుందంటే..

విమాన ప్రయాణ టికెట్ ధరలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. డిమాండ్ ను బట్టి టికెట్ ధరలు మారుతుంటాయి, పెరుగుతుంటాయి.

అర్జెంటుగా ప్రయాణించాల్సి వస్తే టికెట్ ధరలు తగ్గింపునకు సంబంధించి అలర్ట్ చేస్తుందని గూగుల్ కంపెనీ పేర్కొంది.

గతంలో టికెట్ ధరలు ఎలా ఉన్నాయన్న దానిపై గూగుల్ ఫ్లైట్స్ విశ్లేషించి, టికెట్ బుకింగ్ ఎప్పుడు చేసుకుంటే మంచిదో చెప్పేస్తుంది.