నూతన సంవత్సర వేడుకల కోసం ఇంతకన్నా మంచి ప్లేసెస్ ఉండవు.. మన దేశంలోనే..

13 December 2023

 న్యూఇయర్ వేడుకల్లో ఎంజాయ్ చేయాలనుకునేవారికి గోవా బెటర్ ప్లేస్.. చిల్ అవ్వడానికి బీచ్‌లు, క్యాసిన్సో, క్రూయిజ్ రైడ్స్, క్లబ్స్, బార్స్, కాన్సర్ట్స్ , వాటర్ స్పోర్ట్స్ ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి. 

నేచర్ లవర్స్ కు కేరళలోని మున్నార్ మంచి ప్లేస్. ప్రశాంతంగా న్యూ ఇయర్ ఎంజాయ్ చేయాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్. ఇక్కడి ప్రకృతిలో నడుస్తూ ఉంటే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. 

న్యూయర్ వేడుకలు చేసుకోవడానికి హిమచల్ ప్రదేశ్ లోని కులు మనాలి, సిమ్లా బెస్ట్ అప్షన్. ఇక్కడ డీజే నైట్ పార్టీస్ ఓ రేంజ్ లో ఉంటాయి. ఇక్కడ మంచు పడుతున్నప్పుడు చూస్తే ఆ థ్రిల్లే వేరు.

కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి గోకర్ణ మంచి ప్లేస్.  అందమైన బీచ్ లు, వాటర్ ఫాల్స్, చిల్ అవ్వడానికి బార్స్, రిసార్ట్స్, రెస్టారంట్స్ కూడా ఉంటాయి. తక్కువ బడ్జెట్ లో బెస్ట్ ఛాయిస్.

మేఘాలయ రాజధాని షిల్లాంగ్ న్యూఇయర్ వేడుకలు జరుపుకోవడం మంచి అనుభూతిని ఇస్తుంది. కట్టిపడేసే ప్రకృతి, అందమైన జలపాతాలు, సరస్సులు మిమ్మల్నిని ఆకర్షిస్తాయి. 

కాశ్మీర్ ను స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అంటారు. సైట్ సియింగ్ కు శ్రీనగర్ మంచి లోకేషన్, ఇక్కడ ప్రదేశాలు మిమ్మల్ని వేరే లోకంలో తీసుకెళతాయి. మంచులో ఆటలు ఆడాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి.

వయనాడ్- వాటర్ ఫాల్స్, నేచర్ లవర్స్ కు ఈ ఫ్లేస్ బాగుంటుంది. ఇక్కడ ఉండే బ్యూటిపుల్ లేక్స్, కేవ్స్, కాఫీ ప్లాంటెషన్స్ మిమ్మల్నిని ఆకట్టుకుంటాయి. ట్రెక్కింగ్, జిప్ లైనింగ్ వంటి యాడ్వెంచర్స్ చేయడానికి మంచి ప్రదేశం.

పాండిచ్చేరి-న్యూఇయర్ సెలెబ్రేషన్స్ కు ఇది కూడా సూపర్ ప్లేస్. ఇక్కడ అంతా ఫ్రెంచ్ కల్చర్. బసిలికా చర్చ్, పాండిచ్చేరి బొటానికల్ గార్డెన్స్, చిల్ అవ్వడానికి క్లబ్స్, బార్స్, రెస్టారెంట్స్ ఉండనే ఉన్నాయి. తక్కువ బడ్జెట్ ట్రిప్‌.