హైదరాబాద్ చారిత్రాత్మక కట్టడం చార్మినార్. ఇది పాతబస్తిలో ఉన్న స్మారక చిహ్నం, మసీదు. ఇది నాలుగు మీనార్లు కలిగిన ఓ కట్టడము.
గోల్కొండకోట, ఒక పురాతన నగరం. నవాబులు దీన్ని రాజధానిగా చేసుకొని పాలించారు. 1365-1512 సమయంలో ఇది బహుమనీ సామ్రాజ్యములో రాజధానిగా ఉంది.
బుద్ధ విగ్రహం తో విలసిల్లే హుసేన్ సాగర్. ఇది 1562లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనా కాలములో హజ్రత్ హుస్సేన్ షా వలీచే నిర్మింపబడింది.
ఆ నటి రాజా భోగాలను కళ్ళకు చూపించే సాలార్ జంగ్ మ్యూజియం ఇందులో ఏనుగు దంతాల కళాకృతులు, పాలరాతి శిల్పాలు ఆకట్టుకుంటాయి.
రామోజీ ఫిలిం సిటి 2000 ఎకరాలలో విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలింసిటీ. ఇది హైదరాబాదు విజయవాడ 65వ నెంబరు జాతీయ రహదారి పక్కన ఉంది.
వెంకటేశ్వర స్వామి అద్భుత పాలరాతి మందిరం బిర్లా మందిర్. మందిర పై నుంచి హుస్సేన్ సాగర్, బుద్దవిగ్రహం, అసెంబ్లీ, లుంబిని పార్క్ లాంటివి అందంగా కనిపిస్తుంటాయి.
చౌమహల్లా పాలస్ ఆసఫ్ జాహి వంశపు హైదరాబాదు నిజాం నివాసము. ఇది యునెస్కో వారిచే సాంస్కృతిక వారసత్వ కట్టడం.
హైదరాబాద్ కి ఆధునిక హంగులను ఇచ్చిన దుర్గం చెరువు. ఇది హైదరాబాద్ నగరంలో రాయదుర్గ, మాధాపూర్, జూబ్లీహిల్స్ సరిహద్దుల్లో ఉంది.