దక్షిణ భారతదేశంలో చూడదగ్గ అద్భుత పర్యాటక ప్రదేశాలు.. 

13 August 2023

కర్ణాటకలోని కూర్గ్  కశ్మీర్ లాంటి ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఇది. ఇక్కడ అబ్బి జలపాతం, గోల్డెన్ టెంపుల్ మొదలైన అద్భుతమైన ప్రదేశాలను చూడవచ్చు.

కూర్గ్

కారైకుడి తమిళనాడులోని అందమైన ప్రదేశం. ఇక్కడి కరై వీడు చాలా ప్రసిద్ధి చెందింది. ఇది స్నాక్స్,  షాపింగ్‌కు కూడా ప్రసిద్ధి చెందింది.

కారైకుడి

కేరళలో వర్కాలని బీచ్ సిటీ అని పిలుచుకోవచ్చు. మీరు నీవిల్లి వర్కాల బీచ్, జనార్దన స్వామి ఆలయం, కొప్పిల్ బీచ్ మొదలైన ప్రదేశాలను ఆస్వాదించవచ్చు.

వర్కాల

ట్రావెల్ ను ఆస్వాదించే వారికి కర్ణాటకలోని గోకర్ణ బీచ్ ఖచ్చితంగా నచ్చుతుంది. ఓం బీచ్, మహాబలేశ్వర్ టెంపుల్, కుడ్లే బీచ్, ఇక్కడికి వచ్చే పర్యాటకుల్ని కట్టేపడేస్తాయి.

గోకర్ణ

ఉడిపి శ్రీకృష్ణ దేవాలయానికి ప్రసిద్ధి. ఇల్లా బీచ్, రివర్ కయాకింగ్, మల్పే బీచ్, మరవంటే బీచ్, కోడి బీచ్ మొదలైన అనేక బీచ్‌లు కూడా ఇక్కడ ఉన్నాయి.

ఉడిపి

కేరళలో అలెప్పిలో మీరు అద్భుతమైన ప్రదేశాలను చూస్తారు . ప్రధానంగా ఇది బ్యాక్ వాటర్, బోట్ హౌస్, సీ ఫుడ్, బసుందర బీచ్, సరస్సులు కూడా ఇక్కడ ప్రసిద్ధి చెందాయి.

అలెప్పి

పాండిచ్చేరి ఇక్కడ మీరు ప్యారడైజ్ బీచ్, రాక్ బీచ్, ఆరో విల్లా, అరబిందో ఆశ్రమం, ఫ్రెంచ్ కాలనీ మొదలైన అందమైన ప్రదేశాలను చూస్తూ మైమరిపోతారు.

పాండిచ్చేరి

ఇది కూడా ఆకాశానికి ఎత్తే కొండలతో కూడిన అందమైన ప్రదేశం. ఇక్కడ ఉన్న అసంఖ్యాకమైన జలపాతాలు, శిఖరాలు, సరస్సులు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటాయి.

చిక్కమగళూరు