ఇండియా లో టాయ్ ట్రైన్ ఎక్కాలనుకుంటున్నారా ??  అయితే ప్రదేశాలకు వెళ్లాల్సిందే

Phani.ch

03 June 2024

వేసవి సెలవులు ఎంజాయ్ చేసేందుకు, వివిధ ప్రాంతాలు సందర్శించేందుకు రైలు ప్రయాణం మంచి అనుభూతిని ఇస్తుంది. 

అయితే దేశంలోని కొన్ని ప్రముఖ పర్యాటక  ప్రాంతాల్లో ఉన్న 5 అందమైన టాయ్ ట్రైన్స్ ప్రాంతాలేవో తెలుసుకుందాం.. 

నీలగిరి మౌంటెయిన్ రైల్వేకు చెందిన టాయ్ ట్రైన్ మంచి అనుభూతిని కలిగిస్తుంది. మెట్టుపాల్యం నుంచి ఊటీ మధ్యలో ఈ టాయ్ ట్రైన్ నడుస్తుంది.

మాథేరాన్ హిల్ రైల్వే అతి పురాతనమైనది. దీన్ని 1907లో బ్రిటీషర్లు నిర్మించారు. 21 కిలోమీటర్లుండే ఈ రైల్వే లైనులో పశ్చిమ కనుమల్లోని అందమైన ప్రదేశాలు చూడవచ్చు. 

కాంగడా వ్యాలీ రైల్వే హెరిటేజ్ టాయ్ ట్రైన్ హోదా దక్కించుకుంది. ఇది పఠాన్‌కోట్ నుంచి జోగిందర్‌గర్ వరకూ ఉంటుంది. 

కాల్కా-షిమ్లా రైల్వే లైన్ హెరిటేజ్ సెంటర్‌లో చోటు సంపాదించింది. ఈ రైల్వై లైను కొండ ప్రాంతాలు, టన్నెల్స్ దాటుకుంటూ ఉంటుంది. అన్ని అద్భుతమైన వ్యూ పాయింట్సే కన్పిస్తాయి.

పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే ఓ ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పాలి. చాలా సినిమాలు ఈ టాయ్ ట్రైన్ ఆధారంగా తీశారు.