Rose Water : రోజూ రోజ్ వాటర్ ను ముఖానికి అప్లై చేస్తే ఏమవుతుందో తెలుసా?

12 December 2023

ముఖంపై మొటిమలను పోగొట్టడానికి, నల్లని మచ్చలను తగ్గించడానికి రోజ్ వాటర్ బాగా ఉపయోగపడుతుంది. బ్యూటీ కేర్‌లో రోజ్ వాటర్ మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ చూపిస్తుంది. 

చర్మాన్ని మృదువుగా చేయడానికి, వయస్సు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ముఖంపై ఉండే నల్ల మచ్చలను తొలగిస్తుంది.

మొటిమలను రాకుండా చేయడానికి, ఉన్న మొటిమలను తగ్గించడానికి అలాగే ముఖంపై నల్ల మచ్చలను తొలగించడానికి రోజ్ వాటర్ ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

వృద్ధాప్య లక్షణాలు దూరమవుతాయి. చర్మం పొడిబారడం, ముడతలు పడకుండా హెల్ప్ అవుతుంది.

రోజ్ వాటర్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది ఇన్ఫెక్షన్ నుండి చర్మాన్ని కాపాడుతుంది. 

రోజ్ వాటర్ లో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి  ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి. మొటిమలొచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది.

చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన చెమట, మురికిని తొలగిస్తుంది. రాత్రి ముఖాన్ని కడిగిన తర్వాత రోజ్ వాటర్ ను అప్లై చేస్తే చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

రోజ్ వాటర్, కొబ్బరి నూనె కలిపి మేకప్‌ను తొలగిస్తే ఉపయోగంగా ఉంటుంది. ఇది మీ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.