గుడ్ న్యూస్ చెప్పిన విశ్వక్ సేన్.. త్వరలోనే 

14 August 2023

Pic Credit - Instagram

టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న యువ హీరోల్లో విష్వక్ సేన్ ఒకరు. ఈ నగరానికి ఏమైంది సినిమాతో హీరోగా మారాడు విశ్వక్

హీరోగానే కాకుండా దర్శకుడిగానూ తనను తాను నిరూపించుకున్నాడు. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు

ప్రస్తుతం విష్వక్సేన్ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. కృష్ణచైతన్య దర్శకత్వం‌ వహిస్తున్న ఈ సినిమాలో నేహాశెట్టి హీరోయిన్‌.

అంజలి కీలక పాత్రలో నటిస్తోంది. విష్వక్ లుంగీ కట్టుకొని మాస్ లుక్‌ లో కనిపించిన టీజర్ ఆకట్టుకుంది

తాజాగా విశ్వక్ సేన్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని హింట్ ఇచ్చాడు ఈ కుర్ర హీరో.

కుటుంబాన్ని మొదలు పెట్టబోతున్నానంటూ విష్వక్సేన్ నిన్న చేసిన ఓ ట్వీట్ టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

ఇన్నాళ్లుగా నాపై కురిపించిన ప్రేమ, మద్దతుకు నా అభిమానులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు అని రాసుకొచ్చాడు

జీవితంలో మరో కొత్త దశలోకి అడుగుపెట్టబోతున్నానని తెలియజేసేందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నేను ఫ్యామిలీ మొదలెట్టబోతున్నాను అని తెలిపాడు.