దిమ్మతిరిగే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న  వైష్ణవి చైతన్య..

09 August 2023

Pic Credit - Instagram

బేబీ సినిమాతో వైష్ణవి చైతన్య ఒక్కసారిగా స్టార్ అయిపొయింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో వైష్ణవి పేరు గట్టిగా వినిపిస్తుంది 

షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో పాపులారిటీ తెచ్చుకున్న వైష్ణవి చైతన్య అల వైకుంఠపురంలో అల్లు అర్జున్ చెల్లిగా కనిపించింది 

అదే సమయంలో బేబీ దర్శకుడి దృష్టిలో పడటంతో అనూహ్యంగా టైటిల్ రోల్ కి కన్ఫర్మ్ అయ్యింది.

కొన్ని బోల్డ్ ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించి షాక్ ఇచ్చింది. మొత్తంగా ఈ అమ్మడికి మంచి క్రేజ్ వచ్చింది 

వైష్ణవి చైతన్యకి ఎక్కడలేని పాపులారిటీ వచ్చేసింది. దాంతో అవకాశాలు కూడా క్యూ కడుతున్నాయి

నిర్మాతలు కూడా వైష్ణవిని హీరోయిన్ గా తీసుకోవడం కోసం ఆసక్తి చూపిస్తున్నారు. కొంతమంది అడ్వాన్స్ లు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది

రామ్ తో కలిసి నటిస్తుంది ఈ బ్యూటీ . పూరిజగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాలో ఛాన్స్ అందుకున్న వైష్ణవి చైతన్య. 

ఈ మూవీకోసం వైష్ణవికి కోటి రూపాయిల రెమ్యునరేషన్ ని కూడా ఆఫర్ పూరి టీం ఇస్తున్నట్లు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది.