సూపర్ హిట్ కావాలా సాంగ్ పాడిన సింగర్ ఎవరో తెలుసా..

14 August 2023

Pic credit - Instagram

ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోన్న సాంగ్ కావాలా.. జైలర్ సినిమా నుంచి విడుదలై ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఈ పాటలో తమన్నా అందచందాలు .. డ్యాన్స్ లు యూత్ ను మత్తెక్కించాయి. ఈ పాటలోని స్టెప్పులకు యూత్ లో మంచి జోష్ వచ్చింది.

దీంతో ఈ సాంగ్ పాడిన సింగర్ ఎవరో తెలుసుకోవడానికి సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ సాంగ్ పాడింది సింగర్ శిల్పారావు. 

2007లో  అన్వర్ సినిమాలోని తోసే నైనా  పాటతో కెరీర్ ప్రారంభించింది. తెలుగుతోపాటు మలయాళం, తమిళం భాషలలో పాటలు పాడింది. 

అలాగే ఇటీవల షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ బేషరమ్ రంగ్ పాటను కూడా ఆమెనే పాడారు. 

అలాగే పొన్నియన్ సెల్వన్ 2లో రువా రువా, జర హాట్కే జరా బచ్కే లోని సాంఝా సాంగ్స్ ఆలపించి తన మార్క్ క్రియేట్ చేశారు. 

ఇక బాలీవుడ్‏లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించారు శిల్పరావు. రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీలో సాంగ్స్ పాడారు. 

ప్రస్తుతం కావాలా పాటతో సోషల్ మీడియాను  షేక్ చేస్తున్నారు శిల్పరావు. ప్రతి భాషకు దాని పదాలకు నిర్ధిష్ట స్పందన ఉందంటుంది  శిల్పా.