గోల్డెన్ బ్యూటీ జాడే లేదు.. సంయుక్తకు ఛాన్స్ ఇచ్చిన యంగ్ హీరో..

14 August 2023

Pic credit - Instagram

తెలుగు సినీ పరిశ్రమలో గోల్డెన్  బ్యూటీగా క్రేజ్ సంపాదించుకుంది మలయాళీ హీరోయిన్ సంయుక్త మీనన్. భీమ్లా నాయక్ సినిమాతో పరిచయమైంది. 

ఆ తర్వాత సార్, బింబిసార, విరూపాక్ష సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుని టాలీవుడ్ లక్కీ ఛార్మ్ గా మారిపోయింది. 

త్వరలోనే కళ్యాణ్ రామ్ నటిస్తోన్న డెవిల్ చిత్రంతో  అడియనస్ ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఈ సినిమా మాత్రమే ఉంది. 

చాలా కాలంగా సంయుక్త మరో సినిమా అనౌన్స్ చేయలేదు. తాజాగా ఈ బ్యూటీకి మరో బడా ప్రాజెక్ట్ ఛాన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. 

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తో కలిసి నటించే అవకాశం దక్కించుకుంది. ఆయన ప్రస్తుతం స్వయంభూ చిత్రంలో నటిస్తున్నారు. 

ఇందులో సంయుక్త నటించే ఛాన్స్ కొట్టేసినట్లుగా తెలుస్తోంది. నిఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. 

వరుసగా నాలుగు సూపర్ హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో అచి తూచి అడుగులు వేస్తుంది. 

ఈ క్రమంలోనే కంటెంట్ ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.