జాక్ పాట్ కొట్టేసిన రష్మిక.. పుష్ప 2, యానిమల్ తర్వాత ఆ మూవీలో.. 

13 August 2023

Pic credit - Instagram

ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది నేషనల్ క్రష్. 

పుష్ప 2, యానిమల్ వంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తోంది రష్మిక. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. 

ఇంతలోని రష్మికను మరో జాక్ పాట్ వరించింది. చియాన్ విక్రమ్, విజయ్ సేతుపతి నటిస్తోన్న సినిమాలో రష్మిక ఛాన్స్ కొట్టేసింది. 

మలయాళీ డైరెక్టర్ 2018 ఫేం జూడ్ ఆంథోని ఈ భారీ మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నారు. జూడ్ ఇప్పటికే మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. 

భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాలో ఇప్పుడు రష్మిక పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కు రష్మిక ప్రధాన అస్సెట్ కానుంది. 

అయితే విజయ్ సేతుపతి, రష్మిక పేర్లు ఇంకా ఖరారు కాలేదు. ఈ ఇద్దరు తారలతోనూ చర్చలు జరుపుతున్నారు మేకర్స్. 

ఇక అన్నీ ఒకే అయితే అధికారికంగా ప్రాజెక్ట్ ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది.

ఒకవేళ ఈ సినిమాలో రష్మిక ఖరారు అయితే మాత్రం నేషనల్ క్రష్ స్టార్ డమ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకుంది.