వరుణ్ తేజ్ మట్కా సినిమాలో బాలీవుడ్ బ్యూటీ.. ఛార్జ్ ఎంతంటే.. 

Pic credit - Instagram

13 August 2023

వరుణ్ తేజ్ నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం మట్కా. ఇందులో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కీలకపాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. 

ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుందట నోరా. అలాగే ప్రత్యేక పాత్రలోనూ కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. 

అయితే ఈ పాట కోసం నోరా పెద్ద మొత్తంలోనే వసూళు చేస్తుందని సమాచారం. కేవలం పాట కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. 

ఈ పాట కోసం నోరా ఏకంగా రూ.30 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

నోరా ఫతేహి కథానాయికగానే కాదు.. మంచి డ్యాన్సర్ గానూ తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకుంది. గతంలో తెలుగు చిత్రాల్లో నటించింది. 

టెంపర్, కిక్ 2, షేర్, లోఫర్, బాహుబలి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది నోరా. అందులో వరుణ్ తేజ్ నటించిన చిత్రం లోఫర్. 

ఇక ఇప్పుడు మరోసారి వరుణ్ తేజ్ తో కలిసి స్టెప్పులేయబోతుంది నోరా. అలాగే పవన్ నటిస్తోన్న హరిహర వీరమల్లు సినిమాలోనూ నటిస్తుంది. 

ఇందులో నోరా మహారాణి పాత్రలో కనిపించనుందట. జౌరంగజేబ్ చెల్లెలు పాత్రలో నోరా కనిపించనుందని తెలుస్తోంది.