రష్మికకు కలిసోస్తున్న డిసెంబర్.. కారణమదే.. 

Pic credit - Instagram

12 August 2023

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది రష్మిక. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. 

పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీకి బాలీవుడ్ నుంచి అవకాశాలు క్యూ కట్టాయి. గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాల్లో నటించింది. 

ప్రస్తుతం పుష్ప 2, యానిమల్ చిత్రాల్లో నటిస్తుంది రష్మిక. ఇప్పుడు ఈ రెండు సినిమాలు షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. 

అయితే తనకు డిసెంబర్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకుంది. 

తాను నటించిన మొదటి సినిమా కిరిక్ పార్టీ డిసెంబర్ లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఇందులో రక్షిత్ శెట్టి హీరోగా నటించారు. 

ఆ తర్వాత నటించిన నాలుగు సినిమాలు అదే నెలలో విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. అందుకే డిసెంబర్ నెల లక్కీ అంటోంది నేషనల్ క్రష్.

ఇక పుష్ప కూడా అదే నెలలో విడుదలైంది. ఇక త్వరలోనే యానిమల్ మూవీ కూడా అదే నెలలో విడుదల కాబోతుందని తెలిపింది రష్మిక.

ప్రస్తుతం రష్మిక నటిస్తోన్న పుష్ప 2 చిత్రం త్వరలోనే  అడియన్స్ ముందుకు రానుంది. ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.