12 August 2023

జీవితంలో ఆ ఫోటో చాలా ప్రత్యేకమంటున్న నిహారిక.. 

Pic credit - Instagram

మెగా డాటర్ నిహారికి కొణిదెల గురించి పరిచయం అవసరం లేదు. యాంకర్, నటిగా సినీపరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. 

విడాకుల తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది నిహారిక. ఎప్పటికప్పుడు ఫోటోస్ షేర్ చేస్తూ టచ్ లో ఉంటుంది నిహారిక. 

తాజాగా నెటిజన్లతో సరదాగా చిట్ చాట్ నిర్వహించింది. ఈ క్రమంలోనే అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. 

ఇండోనేషియాలోని బాలి తన బెస్ట్ వెకేషన్ ప్లేస్ అని చెప్పుకొచ్చింది. దిస్ ఇజ్ అజ్, డెక్ట్సర్ వెబ్ సిరీస్ ఇష్టమని తెలిపింది నిహారిక.

అలాగే వరుణ్ తేజ్ నిశ్చితార్థంలో తన అన్నయ్యతో కలిసి దిగిన ఫోటో తన  జీవితంలో అత్యంత ప్రత్యేకమని తెలిపింది. 

అంతేకాకుండా తనకు బోర్డ్ గేమ్స్ అంటే చాలా ఇష్టమని.. రొమాన్స్, మర్డర్ మిస్టరీ జోనర్ సినిమాలు అంటే ఆసక్తి అని తెలిపింది. 

ఇటీవలే తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్నారు నిహారిక. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 

ప్రస్తుతం నిహారిక వరుస సినిమాలు.. వెబ్ సిరీస్ చేస్తూ నటిగా మరోసారి బిజీ అవుతున్నారు.  అలాగే నెట్టింట యాక్టివ్ ఉంటున్నారు.