11 August 2023

అలాంటి డ్రెస్ సారా దగ్గర ఒక్కటీ లేదట..!

Pic credit - Instagram

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సారా అలీ ఖాన్ ఒకరు. సైఫ్ అలీ ఖాన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ పటౌడీ క్వీన్. అందం, అభినయంతో మెప్పించింది.

ఇటీవలే జరా హట్కే జరా బచ్కే సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇందులో విక్కీ కౌశల్ హీరోగా నటించారు.

ప్రస్తుతం ఈ బ్యూటీ డినోలో, మిషన్ ఈగిల్ చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సారా.. తన ఫిల్మ్ కెరీర్, వ్యక్తిగత విషయాలను పంచుకుంది. 

తాను డిజైనర్ దుస్తులను గర్వంగా ధరిస్తానని తెలిపింది. కానీ తన వద్ద డిజైనర్ దుస్తులు లేవని చెప్పుకొచ్చింది. 

అలాగే మేకప్,  హెయిల్ స్టైల్ అవసరమయితేనే తప్ప వేసుకోను అని.. ఎప్పుడూ సాధారణంగా ఉంటానంటూ చెప్పుకొచ్చింది. 

ప్రస్తుతం సారా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది సారా. జాన్వీ, అనన్య తన స్నేహితులు అని తెలిపింది సారా.