19 August 2023

నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. రష్మిక అవుట్..

Pic credit - Instagram

ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల. ఈ ముద్దుగుమ్మ తెలుగులో వరుస సినిమాలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 

పెళ్లి సందడి సినిమాతో  తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని అట్రాక్షన్ అయ్యింది. 

దీంతో శ్రీలీలకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. 

ఇక ఇప్పుడు టాలీవుడ్ దర్శకనిర్మాతలకు శ్రీలీల ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తుంది. తాజాగా మరో ఆఫర్ అందుకుంది శ్రీలీల. 

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ నటిస్తోన్న సినిమాలో ముందుగా రష్మిక మందన్నను కథానాయికగా తీసుకున్నారు మేకర్స్. 

అయితే కొన్ని కారణాలతో రష్మిక ఈ మూవీ నుంచి తప్పుకుంది. దీంతో రష్మిక ప్లేస్ లో శ్రీలీలను తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. 

ఇప్పటికే శ్రీలీల, నితిన్ కాంబోలో ఎక్ట్స్ ట్రా ఆర్టినరీ మ్యాన్ సినిమాలో నటిస్తుంది. తాజాగా మరోసారి నితిన్ కొత్తి సినిమాలోనూ ఎంపికైంది. 

గతంలో పూజా ప్లేస్ రీప్లేస్ చేసిన శ్రీలీల ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక ప్లేస్ కూడా రీప్లేస్ చేసి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.