ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేసిన అందాల నిధి అగర్వాల్..

19 August 2023

Pic credit - Instagram

టాలీవుడ్‏లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది నిధి అగర్వాల్. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 

కానీ స్టార్ హీరోయిన్ స్థాయిని మాత్రం అందుకోలేకపోయింది. తమిళంలో కూడా వరుసగా పలు సినిమాలు చేసింది ఈ బ్యూటీ. 

తమిళ్ హీరో శింబుతో లవ్ అంటూ వచ్చిన వార్తలు నిధి కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో అవకాశాలు తగ్గిపోయాయి. 

ప్రస్తుతం పవన్ సరసన హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వార్త వైరలవుతుంది. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసినట్లుగా తెలుస్తోంది. అది కూడా మెయిన్ హీరోయిన్ గా అని టాక్. 

డైరెక్టర్ మారుతి, ప్రభాస్ కాంబోలో రాబోతున్న పీరియాడిక్ హారర్ కామెడీ సినిమాలో నిధిని తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది. 

ఇక ఇదే విషయం నిజమైతే నిధికి లక్కీ ఛాన్స్ దొరికినట్లే. ఇప్పటివరకు నిధికి తెలుగులో సరైన గుర్తింపు రాలేదు. 

అటు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ ఉంటూ ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది నిధి అగర్వాల్.