18 August 2023

దుల్కర్ సల్మాన్ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్.. 

Pic credit - Instagram

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. అందం , అభినయంతో ఆకట్టుకుంది కళ్యాణి. 

కానీ ఈ అమ్మడు నటించిన సినిమాలు తెలుగులో అంతగా హిట్ కాలేకపోయాయి. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆశించినంత స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. 

తెలుగుతోపాటు.. తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించిన కళ్యాణి చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ నెట్టింట ఫుల్ యాక్టివ్. 

తాజాగా ఈ ముద్దుగుమ్మ క్రేజీ ఆఫర్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్ సరసన నటించనుంది కళ్యాణి. 

అట్లీ శిష్యుడు వేలప్పన్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో కథానాయికగా కళ్యాణి ఎంపికైంది. 

జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్న ఈ సినిమా జీ స్టూడియోస్ నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్మెంట్ రానుంది. 

చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న కళ్యాణి ప్రియదర్శన్ కు ఇది లక్కీ ఛాన్స్ అనే చెప్పుకొవాలి. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్. 

ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. ప్రస్తుతం కళ్యాణి లేటేస్ట్ ఫోటోస్ వైరలవుతున్నాయి.