18 August 2023
ప్రేమ సంగతులు బయటపెట్టిన వరుణ్ తేజ్..
Pic credit - Instagram
మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి స్టార్ట్ కాబోతున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం ఘనంగా జరగనుంది.
ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థం జూన్ 9న జరిగింది. ఇక త్వరలోనే పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే.
అయితే నిశ్చితార్థం ఎంత సింపుల్గా జరిగిందో అంతే సింపుల్ గా పెళ్లి కూడా చేసుకుంటామని చెప్పుకొచ్చారు హీరో వరుణ్ తేజ్.
ప్రస్తుతం ఆయన నటించిన గాండివధారి అర్జున సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన తన ప్రేమ సంగతులు చెప్పుకొచ్చారు.
దాదాపు ఐదారేళ్ల నుంచి తామిద్దరం మంచి స్నేహితులమని.. లావణ్య తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చారు వరుణ్ తేజ్.
తన ఇష్టాయిష్టాలన్నీ లావణ్యకు తెలుసని.. ఇద్దరి అభిరుచులు కలవడంతోనే ప్రేమ చిగురించిందని అన్నారు వరుణ్..
ఇక తమ ప్రేమ విషయాన్ని ఎవరు ముందుగా బయటపెట్టారనే విషయాన్ని తెలిపారు. తానే ముందుగా ప్రపోజ్ చేసినట్లు చెప్పారు.
ఇరు కుటుంబాలు తమ ప్రేమను అంగీకరించాయని.. ఇప్పుడు తను వాడుతున్న ఫోన్ లావణ్య కానుకగా ఇచ్చిందని చెప్పుకొచ్చారు.
ఇక్కడ క్లిక్ చేయండి.