విజయ్ దేవరకొండ జోడీగా మజిలీ బ్యూటీ దివ్యాన్ష కౌశిక్.. 

17 August 2023

Pic credit - Instagram

దివ్యాన్ష కౌశిక్.. ఈ పేరు వింటే సినీప్రియులకు ముందుగా గుర్తొచ్చే సినిమా మజిలీ. తెలుగులో ఆమె మొదటి సినిమా ఇదే.

తొలి సినిమాతోనే ఈ బ్యూటీ గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. కానీ క్రేజ్ పూర్తిగా సమంతకు రావడంతో ఈ బ్యూటీకి గుర్తింపు రాలేదు.  

ఈ సినిమా తర్వాత దివ్యాన్షకు మరో ఛాన్స్ రాలేదు. చాలా రోజుల తర్వాత రవితేజ సరసన రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో నటించింది. 

అలాగే యంగ్ హీరో సందీప్ కిషన్ సరసన మైఖేల్ సినిమాలో నటించింది. కానీ ఈ రెండు సినిమాలు ఆశించిన స్తాయిలో మెప్పించలేవు. 

ఇక ఇటీవల ఆమె నటించిన టక్కర్ సినిమా ప్లాప్ అయినప్పటికీ గ్లామర్ పరంగా దివ్యాన్ష కౌశిక్ కు దక్కవలసిన క్రెడిట్ దక్కింది. 

తాజాగా ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ సినిమలో ఛాన్స్ కొట్టేసింది. ఈ ప్రాజెక్టుకు డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహించనున్నారు. 

ఈ సినిమాకు ఒక కథానాయికగా మృణాల్ ఠాకూర్‏ను తీసుకున్నారు. ఇక రెండో హీరోయిన్‏గా దివ్యాన్షను ఎంచుకున్నారు మేకర్స్. 

 ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకు ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.