08 August 2023

హెబ్బాకు సినిమాలే కాదు.. వెబ్ సిరీస్‏లు కూడా కలిసి రావట్లేదు.. 

Pic credit - Instagram

 అంతకుముందు అలా ఎలా అనే సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది ముద్దుగుమ్మ హెబ్బా పటేల్. కెరీర్ తొలినాళ్లలో అందరి అటెన్షన్ గ్రాబ్ చేసింది. ఆ తర్వాత వరస విజయాలతో లక్కీ ఛార్మ్ అనిపించుకుంది. కానీ..

ఈ  సినిమా తర్వాత కుమారి 21 ఎఫ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీతో హెబ్బా బ్యూటీ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆమె లక్కీ గర్ల్ అయిపోయింది. పలువురు నిర్మాతలు అడ్వాన్సులు చెక్కులతో ఆమె వెంటపడ్డారు

ఆ తర్వాత సరైన కథలు ఎంపిక చేసుకోకపోవడంతో ఈ బ్యూటీకి అంతగా విజయాలు రాలేదు. దీంతో హెబ్బా ఫాలోయింగ్ తగ్గిపోయింది. ఆ చేసే సినిమాల్లో పస లేకపోవడంతో.. బ్యూటీ రేస్ నుంచి వెనుకపడింది. 

చిన్న సినిమాలు.. కథలో బలం లేని చిత్రాలు.. పాత్రకు ప్రాధాన్యం లేని సినిమాలన్ని చేసుకుంటూ వెళ్లిపోయింది హెబ్బా. దీంతో ఏదో హీరోయిన్ అంటే హీరోయిన్ మాత్రమే అనిపించుకుంది కానీ మెమరబుల్ పాత్రలు అయితే తనకు రావడం లేదు 

 అవకాశాలు రాకపోవడంతో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది హెబ్బా. అయినా ఎలాంటి గుర్తింపు రాలేదు ఈ  బ్యూటీ. తనకు లైఫ్ ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లలేక.. ఇక్కడ సరైన అవకాశాలు లేక నలిగిపోతుంది హెబ్బా 

దీంతో ఇప్పుడు ఈ బ్యూటీ వెబ్ సిరీస్ పై ఫోకస్ పెట్టింది. వరుసగా వెబ్ సిరీస్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.  ఓటీటీపై అయినా తన ఫేట్ మారుతుందేమో అని చెక్ చేసుకుంటుంది. 

 కానీ ఈ సిరీస్ లు కూడా హెబ్బాకు లక్ రావడం లేదు. ఆమె చేసిన సిరీస్ లు ప్రేక్షకులకు అంతగా రీచ్ కావడం లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు ఈ బ్యూటీకి. వేణు స్వామీ ఆమె పూజలు చేపిస్తే బెటర్ అంటున్నారు ఫ్యాన్స్  

 ప్రజంట్ తమిళ ఇండస్ట్రీ వైపు చూస్తుంది ఈ బ్యూటీ... అక్కడ పాగా వేసేందుకు ప్రయత్నిస్తుంది. విభిన్న పాత్రలు కావాలని దర్శకులను కోరుతుంది.  మరి ఆమె ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి.