మహేష్.. నమ్రతల లవ్ స్టోరీ.. ఎవరు ప్రపోజ్ చేశారంటే..
08 August 2023
Pic credit - Instagram
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ అంటే గుర్తొచ్చే జోడీ మహేష్ బాబు.. నమ్రత. ఈ జంటకి ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. వీళ్లు కపుల్ గోల్స్ ఇవ్వడంలో ఎప్పుడూ ఫెయిల్ అవ్వరు. ఒకరిపై ఒకరు ఎంతో బాండింగ్ కలిగి ఉంటారు.
మహేశ్, నమ్రతలది ప్రేమ వివాహం అన్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది నమ్రత. బిజినెస్‌లతో పాటు పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూ ముందుకు వెళ్తుంది.
మహేశ్, నమ్రతలు వంశీ సినిమాలో నటించారు. అప్పుడే ఒకరిపై ఒకరికి ఇష్టం కలిగి ప్రేమలో పడ్డారు. ఆ తర్వాతి కాలంలో పెద్దల అంగీకారంతో మ్యారేజ్ చేసుకున్నారు.
2000లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన వంశీ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయినప్పటికీ.. వీరి జీవిత బంధానికి మాత్రం బలమైన ముడి వేసింది.
ఈ మూవీ షూటింగ్ కొంతకాలం విదేశాల్లో జరిగింది. అప్పుడు ఇద్దరూ ఒకరి గురించి మరొకరు తెలుసుకునే అవాశం లభించిదట. చాలా విషయాల్లో అభిప్రయాలను షేర్ చేసుకున్నారట
ఈ మూవీ షూటింగ్ న్యూజిలాండ్ లో 25 రోజులు జరిగిందట. అక్కడి నుంచి వచ్చాక నమ్రతనే ఫస్ట్ ప్రపోజ్ చేసిందట మహేష్ బాబుకు. మరి మహేశ్ ఫస్ట్ ఏం ఆన్సర్ ఇచ్చారో నెక్ట్స్ స్లైడ్‌లో తెలుసుకుందాం పదండి
మహేశ్ సోదరి మంజులకు తన ప్రేమ విషయం చెప్పాడట మహేశ్. ఆమె సహాయంతో వీరిద్దరి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. వీరి వివాహం ముంబైలో జరిగింది. చాలా క్లోజ్ సర్కిల్ మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు.
పెళ్లి తర్వాత మహేష్ కెరీర్ మరింత స్పీడ్ అయ్యింది. ప్రమోషన్స్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు నమ్రత దగ్గరుండి చూసుకుంటారు. అతడి గ్లామర్, హెయిర్ స్టైల్ విషయంలో కూడా ఆమె పాత్ర ఉంది. సినిమాలకు, ప్యామిలీకు సెపరేట్ టైమ్ పెట్టుకుని ఆ ప్రకారం ముందుకు వెళ్లాడు మహేశ్.