అవకాశాల కోసం రాళ్లపై కూర్చున్న హీరోయిన్.. 

07 August 2023

Pic credit - Instagram

మాధురీ దీక్షిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ ఆమె. 

 ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ రాణిస్తోంది మధూరీ. 

కానీ కెరీర్ మొదట్లో చాలా కష్టాలు పడిందట. హీరోయిన్ గా అవకాశాల కోసం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందట.  

ఆమె చిన్న వయసులో ఉన్నప్పుడు కొందరు వ్యక్తులు ఆమె తండ్రిని మోసం చేసి ఆస్తులు లాక్కున్నారట. 

ఆస్తి పొగొట్టుకుని ఆమె కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందట. చాలా కాలం ఆమె కుటుంబం ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నారు. 

కెరీర్ మొదట్లో తల్లితో కలిసి చిత్రపరిశ్రమలో అవకాశాల కోసం తిరిగిందట. హీరోయిన్ ఛాన్స్ కోసం కష్టపడింది. 

ముంబయిలోని ఫిలింసిటీలో ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తన తల్లితో కలిసి అక్కడకు వెళ్లింది మాధురీ. 

ఆ సినిమాలో తనకు ఏదైనా పాత్ర ఛాన్స్ ఇస్తారేమో అని అక్కడే రాళ్లపై కూర్చొని వెయిట్ చేసిందట.