సినిమా ఇండస్ట్రీలో నటీనటులు బెస్ట్ ఫ్రెండ్స్ అయి చాలాకాలం ముందుకు సాగడం పెద్ద విషయమే. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎక్కువగా సక్సెస్‌లను బట్టి స్నేహాలు మారిపోతాయి. చిరు, నాగ్ మాత్రం కెరీర్ తొలినాళ్ల నుంచి కలిసి ఉన్నారు. ఫ్యామిలీ పరంగా కూడా క్లోజ్. అంతేకాదు కలిసి బిజినెస్‌లు కూడా రన్ చేస్తున్నారు.
చరణ్, తారక్ ఎప్పట్నుంచో ఫ్రెండ్స్. అయితే ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ఆ బంధం మరింత బలపడింది. స్నేహం కంటే తమ మధ్య బ్రదర్స్ లాంటి రిలేషన్ ఉంటుందని వారు పలుమార్లు చెప్పారు.
ఇక రామ్ చరణ్, రానా స్కూల్ నుంచి ఫ్రెండ్స్. ఇద్దరూ చిన్నప్పుడు చాలా కొంటె పనులు చేసేవారట. క్లాసులు బంక్ కొట్టి బయట తిరగడాలు వంటివి చేశారట. వారి బాండింగ్ ఇప్పటికీ చెక్కు చెదరలే.
వర్షం సినిమాలో కలిసి నటించారు గోపిచంద్, ప్రభాస్. సినిమాలో విలన్, హీరోగా నటించినప్పటికీ.. బయట మాత్రం వీరు బయట ఫ్రెండ్స్. ఇద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమను ప్రదర్శించుకుంటూ ఉంటారు.
యువ హీరోలు నితిన్, అఖిల్ అక్కినేని మంచి ఫ్రెండ్స్ అట. వీరి గురించి బయట ఎక్కువ ప్రచారం జరగదు కానీ.. ఇద్దరూ రెగ్యులర్ కలుస్తూ.. ఫ్రెండ్షిప్ గోల్స్ విసురుతున్నారు ఈ యువ హీరోలు.
అల్లరి నరేశ్, నాని చాలా బెస్ట్ ఫ్రెండ్స్. వీరి ఫ్యామిలీలు కూడా చాలా క్లోజ్. రెగ్యులర్ ఒకరి ఇంటికి మరొకరి ఫ్యామిలీ వెళ్లి వస్తుంటారు. వెకేషన్స్‌కు కూడా కలిసే వెళ్తారు.
రామ్ చరణ్, శర్వానంద్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఒక రకంగా శర్వా ఇండస్ట్రీలోకి రావడానికి కారణం చరణే. చరణ్ ఫ్రెండ్ అవ్వడం చేత చిరు నటించిన ఓ యాడ్‌లో మెరిశాడు శర్వా.
ఇక పవన్, త్రివిక్రమ్ ఎంత ఆప్తమిత్రులో చెప్పాల్సిన పనేలేదు. వారిపై ఒకరిపై ఒకరు ప్రేమను ఎప్పుడూ వ్యక్తపరుస్తూనే ఉంటారు. తరుచూ కలిసి మాట్లాడుకుంటారు.