29 August 2023

సలార్ కోసం పెద్ద సాహసమే చేస్తోన్న శ్రుతిహాసన్.. 

Pic credit - Instagram

 టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రుతి హాసన్. ఇటీవల బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించిన ఈ బ్యూటీ చాలా రోజులుగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. 

ప్రస్తుతం ఆమె నటించిన చిత్రం సలార్. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో త్వరలోనే రిలీజ్ కానుంది. 

ఇప్పటికే విడుదలైన శ్రుతి హాసన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. ఇక తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది శ్రుతిహాసన్.  ఈ విషయాన్ని గతంలోనే వెల్లడించింది. 

ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం పెద్ద సాహసమే చేయబోతుంది శ్రుతిహాసన్. తెలుగుతోపాటు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. 

 అయితే ఈ సినిమా డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేసింది శ్రుతి హాసన్. మొత్తం ఐదు భాషల్లో ఆమె సొంతంగా డబ్బింగ్ చెప్పేందుకు సిద్ధమయ్యిందట. 

 ఇప్పటికే మూడు భాషల డబ్బింగ్ కంప్లీట్ చేసిన శ్రుతి హసన్, ఇప్పుడు మరో రెండింటిని కూడా కంప్లీట్ చేసే బిజీలో ఉందని సమాచారం వినిపిస్తుంది. 

సాధారణంగా హీరోయిన్లు ఒక భాషలో డబ్బింగ్ చెప్పేందుకు ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది శ్రుతి ఏకంగా ఐదు భాషల్లో చెప్పడమంటే సాహసమే. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రుతి హాసన్ హాయ్ నాన్న, ఇంగ్లీష్ లో ది ఐ అనే సినిమాల్లో నటిస్తుంది. హాయ్ నాన్న చిత్రంలో కీలకపాత్రలో కనిపించనుంది.