29 August 2023
అక్కినేని నాగార్జున, అమల లవ్ స్టోరీ.. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారంటే..
Pic credit - Instagram
అక్కినేని నాగార్జున.. తెలుగు సినీ పరిశ్రమలో నవ మన్మథుడు. యూత్‌లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో. ఈరోజు నాగ్ బర్త్ డే.
ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. నాగ్, అమల లవ్ స్టోరీ గురించి తెలుసుకుందామా.
నాగార్జున ముందుగా దగ్గుబాటి రామానాయుడు కుమార్తె లక్ష్మీని వివాహం చేసుకున్నారు. వీరికి నాగచైతన్య జన్మించారు. కానీ వీరిద్దరు 1990లో విడిపోయారు.
ఆ తర్వాత నాగ్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు. ఆర్జీవీ దర్శకత్వంలో నాగ్ చేసిన సినిమా శివ. ఇందులో అమల హీరోయిన్ గా నటించారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలో అమలతో పరిచయం ఏర్పడింది. అమల సమయపాలన, అంకితభావం నాగార్జునను ప్రధానంగా ఆకర్షించింది.
చాలా కాలం స్నేహితులుగా ఉన్న వీరు.. ఆ తర్వాత ఒకరినొకరు ఇష్టపడ్డారు. శివ సినిమా తర్వాత పలు చిత్రాల్లో కలిసి నటించారు నాగ్, అమల.
1991లో వీరిద్దరు కలిసి అమెరికా పర్యటనకు వెళ్లారు. ఇక అక్కడే అమలకు నాగార్జున ముందుగా ప్రపోజ్ చేశారు. ఇక అమల సైతం వెంటనే అంగీకరించింది.
కొన్నాళ్లు ప్రేమలో ఉన్న వీరు ఇరువురు కుటుంబ సభ్యులను ఒప్పించి 1992లో వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి అఖిల్ జన్మించారు.
ఇక్కడ క్లిక్ చేయండి.