నితిన్ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్న  సప్తమి గౌడ.. 

Rajeev 

01 july  2025

Credit: Instagram

కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటిస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది సప్తమి గౌడ.. ఈ అమ్మడికి తెలుగులోనూ మంచి ఫ్యాన్స్ ఉన్నారు.

కన్నడలో సప్తమి గౌడ ‘పాప్‌కార్న్ మంకీ టైగర్’ సినిమాతో విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఆమెకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. 

ఆ తర్వాత ‘ కాంతార ‘ సినిమాలో ఛాన్స్ అందుకుంది. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. 

 ఆ తర్వాత హిందీ సినిమాల్లోకి కూడా అడుగు పెట్టింది సప్తమి. ఆ తర్వాత ఈ చిన్నది సైలెంట్ అయ్యింది. 

చాలా కాలం గ్యాప్ తర్వాత ఇప్పుడు టాలీవుడ్ సినిమాతో రాబోతుంది. నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది సప్తమీ గౌడ. 

ఈ సినిమాలో ఆమె ఓ గిరిజన యువతిగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఆమె లుక్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 

ఈ సినిమా పైనే సప్తమి ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటే తెలుగులో ఈ వరుస ఛాన్సులు అందుకోవండం ఖాయం.