ఇంకెక్కడి పెళ్లి బ్రో.. మ్యారెజ్ పై ఫన్నీ కామెంట్స్ చేసిన సాయి ధరమ్ తేజ్..
ప్రస్తుతం బ్రో సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు సాయి ధరమ్ తేజ్.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సాయి తేజ్ కలిసి నటించారు.
తాజాగా ఈ మూవీ సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ తిరుపతిలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తేజ్ పెళ్లి గురించి స్పందించారు.
తేజ్ మాట్లాడుతుండగా.. పెళ్లి ఎప్పుడు ?అని ఫ్యాన్స్ అడిగారు.
ఇంకెక్కడి పెళ్లి బ్రో.. ఈ సినిమా ముందు వరకు ఎవరో ఒకరు ట్రై చేశారు.
టైటిల్ చూశాక అందరూ నన్ను బ్రో అంటున్నారని ఫన్నీ కామెంట్స్ చేశారు తేజ్.
ఇక్కడ క్లిక్ చేయండి.