తెలుగమ్మాయి రీతూ వర్మ చీరల కలెక్షన్స్ చూశారా ?
23 August 2023
Pic credit - Instagram
తెలుగు సినీపరిశ్రమలో రీతూవర్మ స్పెషల్. హైదరాబాద్ అమ్మాయి హీరోయిన్గా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ బ్యూటీ.
చీరకట్టులో రీతూవర్మ ఎప్పటికప్పుడు అందంగా కనిపిస్తుంటుంది. ఇప్పటికే చాలాసార్లు చీరకట్టులో ఆమె ఫోటోషూట్స్ చేసింది.
గీతిక కానుమిల్లి డిజైన్ చేసిన మ్యాజింగ్ ఎంబెల్లిష్డ్ బ్లౌజ్, టీల్-గ్రీన్ క్రింకిల్ చీరలో రీతూ వర్మ ముస్తాబయ్యింది. ఈ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
అలాగే గులాబీ రంగు చీరలలో చమ్కీల డిజైన్‌తో తయారు చేసిన చీరలో కనిపించింది రీతూ వర్మ. ఈ శారీ అర్నాజ్, గోపి వైద్ లేబుల్ అని తెలుస్తోంది.
పార్సీ ఎంబ్రాయిడరీ వర్క్‌తో కూడిన ఈ తెల్లని స్వచ్చమైన ఆర్గాన్జా సిల్క్ చీరలో రీతూ వర్మ మరింత అందంగా కనిపిస్తుంది.
ఆకుపచ్చని చందేరీ చీరలో కనిపించింది రీతూ వర్మ. పోతీస్ బోటిక్ కలెక్షన్స్ నుంచి కాంట్రాస్ట్ రెడ్ బ్లౌజ్ ధరించింది రీతూ.
క్రేషా బజాజ్ స్టోర్స్ నుంచి కాంటెంపరరీ స్టైల్ బ్లౌజ్, సీక్విన్ అలంకారాలతో ఉన్న రాయల్ బ్లూ చీరలో కనిపించింది రీతూ వర్మ.
అలాగే మెరూన్ పట్టు చీరలో ట్రెడిషనల్ గోల్డ్ జ్యూవెల్లరీతో చూడముచ్చటగా కనిపించింది రీతూవర్మ. ఈ ఫోటోస్ చక్కర్లు కొడుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి.