01 September 2023
ఆ వార్తలలో ఎలాంటి నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన రష్మిక మందన్నా..
Pic credit - Instagram
టాలీవుడ్ టూ బాలీవుడ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది హీరోయిన్ రష్మిక మందన్నా. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.
అందులో అల్లు అర్జున్ జోడిగా పుష్ప 2 సినిమా కాగా.. మరొకటి బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ సరసన యానిమల్ చిత్రంలో నటిస్తుంది.
అయితే భీష్మ తర్వాత హీరో నితిన్ జోడిగా మరో కొత్త ప్రాజెక్ట్ ఒప్పుకుంది రష్మిక. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
కానీ ఈ సినిమా నుంచి రష్మిక తప్పుకుందని.. ఆమె స్థానంలోకి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీలను తీసుకున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అందుకు కారణం బాలీవుడ్ ఇండస్ట్రీలో వస్తోన్న ఆఫర్స్ కారణమని.. అందుకే టాలీవుడ్ సినిమాల నుంచి ఈ బ్యూటీ తప్పుకున్నట్లుగా టాక్ నడిచింది.
తాజాగా ఈ వార్తలపై స్పందించింది రష్మిక మందన్నా. తన గురించి వస్తున్న వార్తలన్ని అవాస్తవమని.. అందులో ఎలాంటి నిజం లేదని తెలిపింది.
దీంతో నితిన్ సినిమాలో రష్మిక నటిస్తుందనే వార్తలలో మాత్రం క్లారిటీ వచ్చింది. అటు బాలీవుడ్ లోనూ ఈ బ్యూటికి అవకాశాలు వస్తున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ సరసన రష్మికను ఎంపిక చేశారని టాక్ వినిపిస్తుంది. ఇటు సౌత్ లోనూ ఫుల్ ఆఫర్స్ వస్తున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి.