పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్.. పవన్ కళ్యాణ్‌ను మొదటిసారి పవర్ స్టార్ అని ఎవరు పిలిచారో తెలుసా..
01 September 2023
Pic credit - Instagram
సెప్టెంబర్ 2న పవర్ స్టార్ బర్త్ డే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో తమ అభిమాన హీరో పుట్టినరోజు సంబరాలను మొదలు పెట్టేశారు మెగా అభిమానులు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటే తెలుగు రాష్ట్రాల్లోని మెగా అభిమానులకు ఒక ఊపు వస్తుంది. అంతేకాదు ఒక ఎనర్జీ కూడా వస్తుంది.
హిట్టు, ప్లాపు సంబంధం లేకుండా విడుదలైన మొదటి రోజు రికార్డ్స్ స్థాయిలో వసూళ్లు రాబట్టడమే కాదు.. రోజు రోజుకి క్రేజ్ పెరుగుతూనే ఉంది.
అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి బాటలో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్లారు పవన్ కళ్యాణ్.
అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి బాటలో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్లారు పవన్ కళ్యాణ్.
ప్రపంచవ్యాప్తంగా ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. పవన్ సినిమా రిలీజ్ అయ్యిందంటే థియేటర్లలో పండగ వాతావరణం వచ్చేస్తుంది.
గోకులంలో సీత సినిమా సక్సెస్ మీట్ లో ఆ సినిమాకు డైలాగ్స్ రాసిన పోసాని కృష్ణమురళి పవర్ స్టార్ అనే పదం వాడుతూ పవన్ ను సంభోదించారు.
ఆ తర్వాత సుస్వాగతం సినిమాకు టైటిల్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని మొదటి సారి వేశారు. ఆ తర్వాత పవర్ స్టార్ పేర్ ట్రెండ్ అయ్యింది.
ఇక్కడ క్లిక్ చేయండి.