ఈ అమ్మాయి నిజంగా అద్భుతమే.. అనుపమ ఎంత ముద్దుగా ఉందో..

30 August 2023

Pic credit - Instagram

టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యథిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. 

గతేడాది కార్తికేయ 2, 18 పేజిస్ చిత్రాలతో హిట్స్ అందుకుంది. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ సరసన డీజే టిల్లు 2 చిత్రంలో నటిస్తుంది ఈ కేరళ కుట్టి.

తాజాగా ఓనమ్ సందర్భంగా  అనుపమ పరమేశ్వరన్ స్పెషల్ ఫోటోషూట్ చేసింది. చీరలో ట్రెడిషన్ గా కనిపిస్తూ అందర్నీ ఫిదా చేసింది కేరళ కుట్టి. 

తెలుపు రంగు పట్టు అంచు కసవు చీరలో.. జడలో మల్లెపూలతో అందమే అసూయ పడేంత అద్భుతంగా కనిపిస్తోంది అనుపమ పరమేశ్వరన్.

ఓనమ్ సందర్భంగా అనుపమ షేర్ చేసిన ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ఫోటోలకు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. 

ఈ క్రమంలో ఫాలోవర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ మలయాళంలో ఓనమ్ సాంగ్ పాడి అలరించింది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. 

రింగు రింగుల జుట్టుతో పట్టు అంచు ఉన్న వైట్ శారీలో  తన ఇంటి ముందు కూర్చొని మలయాళంలో ఓనమ్ సాంగ్ పాడింది అనుపమ. 

 అనుపమకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఆమె షేర్ చేసిన ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరలవుతుంటాయి.