22 August 2023

మెగాస్టార్ చిరంజీవి నట ప్రస్థానంలో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు.. 

Pic credit - Instagram

తెలుగు సినీపరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి ఒక లెజెండ్. పట్టుదల, స్వయంకృషితో మెగాస్టార్‏గా ఎదిగిన అసామాన్యుడు చిరు. 

ఆగస్ట్ 22న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా చిరంజీవి నటప్రస్థానంలో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర  గురించి తెలుసుకుందామా. 

పసివాడి ప్రాణం..ఇందులో మధు అనే పెయింటర్ అబ్బాయి పాత్రలో నటించి మెప్పించాడు చిరంజీవి. ఈ సినిమా చిరు కెరీర్లో వన్ ఆఫ్ ది హిట్.

చంటబ్బాయి.. సుహాసిని, చిరంజీవి కలిసి నటించిన సినిమా ఇది. ఇందులో డిటెక్టివ్ పాండురంగ 'పాండు' పాత్రలో కడుపుబ్బా నవ్వించారు చిరంజీవి. 

ఆపద్భాంధవుడు.. చిరంజీవి, జంధ్యాల కాంబోలో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్ మూవీ. ఈ సినిమాలోని ప్రతి పాట ఇప్పటికీ శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. 

రుద్రవీణ.. ఈ సినిమా ఒక అద్భుతమైన సంగీత నాటక చిత్రం. ఇందులో సూర్య నారాయణ పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు చిరంజీవి.

శుభలేఖ.. చిరంజీవి సినిమాల్లో విజయం అందుకున్న సినిమాల్లో ఇది ఒకటి. ఇందులో నరసింహామూర్తిగా కనిపించి మెప్పించారు చిరంజీవి. 

స్వయం కృషి..  ఈ చిత్రంలో చెప్పులు కుట్టే పాత్రలో నటించి సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు చిరంజీవి. ఈ సినిమాకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు చిరంజీవి.