22 August 2023
ఓనమ్ సెలబ్రెషన్స్ కోసం అనుపమ పరమేశ్వరన్ శారీ ఐడియాస్
Pic credit - Instagram
అనుపమ పరమేశ్వరన్.. తెలుగు సినీపరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ హీరోయిన్లలో ఒకరు. ముఖ్యంగా యూత్‌లో ఈ కేరళ కుట్టికి ఫుల్ క్రేజ్ ఉంది.
సంప్రదాయ దుస్తులలో అనుపమ మరింత అద్భుతంగా కనిపిస్తుంది. ఓనమ్ పండుగ సెలబ్రెషన్లకు అనుపమ శారీ డిజైన్ ఐడియాస్ చూద్దాం.
ఎరుపురంగు హాఫ్ స్లీవ్ బ్లౌజ్, తెలుపు, బంగారు రంగు చీరను ధరించింది అనుపమ. ఓనమ్ పండుగకు మరింత అందంగా తయారైంది.
ఓనమ్ సంబరాల్లో కసవు చీర తప్పనిసరిగా ఉండాలి. ఎరుపు రంగు బ్రౌజ్ తోపాటు కసవు చీరలో మంత్రముగ్దులను చేసింది అనుపమ.
అలాగే తెలుపు రంగు చీరకు బ్లూ కలర్ బ్లౌజ్ జతచేసి తన అందమైన రూపంతో కట్టిపడేసింది ఈ కేరళ కుట్టి.
పట్టు, కసవు చీరలు కాకుండా.. కొన్నిసార్లు సిల్క్ డ్రెప్ చీరలోనూ అలరించింది. ప్రతి ఓనమ్ సంబరాలకు అనుపమ స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది.
ఇక కొన్నిసార్లు సంప్రదాయ చీరకట్టులో ఫోటోషూట్స్ చేస్తుంటుంది ఈ బ్యూటీ. అలా నీలిరంగు చీరలో మైమరపించింది అనుపమ.
ఇక పూర్తిగా తెలుపు రంగు చీర, బ్లౌజ్ లో ముంగురులలో మల్లెపూలతో పూర్తిగా సంప్రదాయ లుక్ లో కనిపించి ఆకట్టుకుంది అనుపమ పరమేశ్వరన్.
ఇక్కడ క్లిక్ చేయండి.