20 August 2023
రెమ్యూనరేషన్లో తగ్గేదేలే అంటోన్న అనుష్క..
Pic credit - Instagram
ఒకప్పుడు టాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో మెప్పించింది అనుష్క శెట్టి. సూపర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
స్టార్ హీరోస్ అందరి సరసన నటించి అగ్రకథానాయికగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది అనుష్క.
బాహుబలి సినిమా తర్వాత అనుష్కకు ఆఫర్స్ తగ్గిపోయాయి. చివరిసారిగా నిశ్శబద్ధం సినిమాలో నటించింది అనుష్క.
సిల్వర్ స్క్రీన్ పై అనుష్క కనిపించింది దాదాపు మూడేళ్లవుతోంది. ప్రస్తుతం ఆమె మిస్ శెట్టి మిస్టర్ శెట్టి సినిమాలో నటిస్తుంది.
ఇందులో నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటిస్తుండగా.. హీరోయిన్ గా అనుష్క నటిస్తుంది. ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది
గతంలో అనుష్క ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంది. కానీ ఇప్పుడు పాతితోషికం డబుల్ చేసినట్లుగా తెలుస్తోంది.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రానికిగానూ ఆమె ఆరు కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం అనుష్క రెమ్యూనరేషన్ విషయం సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. మూడేళ్లైనా భారీగానే వసులు చేస్తోంది స్వీటీ.
ఇక్కడ క్లిక్ చేయండి.