ఆ టాప్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన అదితి శంకర్.. 

Pic credit - Instagram

20 August 2023

డైరెక్టర్ శంకర్ కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైంది అదితి. తొలి సినిమా విరుమాన్ తోనే నటిగా  ప్రశంసలు అందుకుంది. 

ఇటీవలే శివకార్తికేయన్ సరసన మావీరన్ సినిమాలో నటించారు.  ఇక ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. 

ప్రస్తుతం విష్ణువర్దన్ దర్శకత్వంలో అధర్వ తమ్ముడు ఆకాష్ మురళికి జంటగా నటిస్తున్నారు అదితి శంకర్.

ఆ తర్వాత ఆమె రాక్షసన్ చిత్రం ఫేమ్ రామ్ కుమార్ కొత్త సినిమాలో నటించనున్నారు. ఇప్పటికే ఒప్పందం కుదిరింది. 

తాజాగా మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసింది. హీరో సూర్య సరసన అదితి నటించనున్నట్లుగా నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి.

సూర్య ప్రస్తుతం కంగువ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత వెట్రిమారన్ దర్శకత్వంలో నటించనున్నారు.

ఈ సినిమా కాకుండా డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో నటించనున్నారు. వీరి కాంబోలో మరో మూవీ రాబోతుంది.

ఇక ఈ సినిమాలో కథానాయికగా అదితిని ఎంపిక చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అధికారిక ప్రకటన రాలేదు.