అమ్మడి స్పీడ్ తగ్గడం లేదుగా.. వరుస సినిమాలు లైనప్ చేసిన కీర్తిసురేష్ 

19 August 2023

Pic Credit - Instagram

నాగ్ అశ్విన్ నటించిన 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ కీర్తిసురేష్.

కీర్తి సురేష్‌కు ఇటీవల తెలుగులో దసరా అనే సినిమాలో నటించింది. ఈ సినిమా మార్చి30న గ్రాండ్‌గా విడుదలై బంపర్ హిట్ అయ్యింది.

చిరంజీవి హీరోగా వచ్చిన భోళా శంకర్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో చిరంజీవి సిస్టర్ గా నటించింది కీర్తిసురేష్. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.

ఇదిలా ఉంటే మరోసారి మెహర్ రమేష్ దర్శకత్వంలో నటించనున్నారట. ఈసారి లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయనున్నారని టాక్.

ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కీర్తిసురేష్ నటిస్తుండగా.. తమన్నా కీలక పాత్రలో కనిపిస్తుందని టాక్ వినిపిస్తుంది.

త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో కీర్తిసురేష్ సినిమా చేస్తుందని తెలుస్తోంది. తేరి మూవీ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోందని టాక్

నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో ఓ కొత్త సినిమా వస్తోంది. ఈ సినిమాలో కీర్తిని హీరోయిన్‌గా తీసుకుంటున్నారట దర్శక నిర్మాతలు.

సూరత్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ లవ్‌స్టోరీ అని తెలుస్తోంది. ఈ మూవీలో నాగచైతన్య బోటు డ్రైవర్‌‌గా కనిపించనున్నారట