నా పై దుష్ప్రచారం చేస్తున్నారు.. కంగనా షాకింగ్ కామెంట్స్

16 August 2023

Pic Credit - Instagram

బాలీవుడ్‌ సంచలన నటి కంగనా రనౌత్‌ గురించి ఎదో ఒక కాంట్రవర్సీ వార్త వస్తూనే ఉంటుంది. ఆమె అక్కడ ఎప్పుడు హాట్ టాపిక్ గా ఉంటుంది

బాలీవుడ్ పైనే ఆమె సంచలన కామెంట్స్ చేసి రచ్చ లేపింది. స్టార్ హీరోలను కూడా వదల్లేదు కంగనా

పలువురు రాజకీయ నాయకుల పైన కూడా కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఇక నటిగా మాత్రం అనే తన సత్తా చాటుకుంటుంది. నిర్మాత, దర్శకురాలు కూడా ప్రతిభను చాటింది కంగనా

ప్రస్తుతం చంద్రముఖి 2 లో నటిస్తుంది కంగనా రనౌత్. ఈ సినిమాకు లారెన్స్ దర్శకుడు

తాజాగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ట్విట్టర్‌ ద్వారా విరుచుకుపడింది కంగనా

తనకు వ్యతిరేకంగా డబ్బిచ్చి మరీ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆరోపించింది

150  కోట్లు వసూల్ చేసిన తన సినిమాలను కూడా ఫ్లాప్ అనే వార్తలను పుట్టిస్తున్నారని ఆరోపించింది

దీని వెనుక ఒక పెద్ద మాఫియా ఉందని.. నా గురించి రాత్రింబవళ్లు ఆలోచించి డబ్బులు వెస్ట్ చేసుకోకండి అంటుంది కంగనా