30 August 2023
ఫస్ట్ బ్రేకప్ పై జాన్వీ ఓపెన్.. అందుకే బంధం ముగిసిందట..
Pic credit - Instagram
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఇప్పుడే అడుగుపెడుతుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది.
మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో జాన్వీ మత్య్స కుటుంబానికి చెందిన అమ్మాయిగా ఢీ గ్లామర్ లుక్ లో కనిపించనుంది.
ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న జాన్వీ తన ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ తో బంధాన్ని ఎందుకు ముగించుకుందనే విషయాన్ని బయటపెట్టింది.
తన ఫస్ట్ బాయ్ ఫ్రెండ్, తను రహస్యంగా కలుసుకునేవాళ్లమని.. ఇద్దరు ఒకరికి ఒకరు చాలా అబద్దాలు చెప్పుకునేవాళ్లమని తెలిపింది జాన్వీ కపూర్.
తను చెప్పిన ఓ అబద్ధం కారణంగా ఆ రిలేషన్ ముగిసిందని.. అలాగే తనకు బాయ్ ఫ్రెండ్ ఉండకూడదని తల్లిదండ్రులు చెప్పినట్లు జాన్వీ చెప్పుకొచ్చింది.
వాళ్లతో నిజాయితీగా ఉంటే అన్నీ సులభంగా మారతాయని అర్థం చేసుకున్నానని.. పేరంట్స్ నిర్ణయాలకు అనుగుణంగా వెళ్తే భవిష్యత్తు బాగుంటుందని తెలిపింది.
అయితే ఈ సంఘటన ఎప్పుడు జరిగిందనేది మాత్రం జాన్వీ చెప్పలేదు. దీంతో నెటిజన్స్ సరదాగా స్పందిస్తూ జాన్వీకి ప్రశ్నలు వేస్తున్నారు.
ప్రస్తుతం జాన్వీ దేవర షూటింగ్ లో పాల్గొంటుంది. సెట్ లో అందరూ తనతో ప్రేమగా మాట్లాడతారని.. సొంతింటిలాగా అనిపిస్తుందని తెలిపింది.
ఇక్కడ క్లిక్ చేయండి.