07 August 2023

ఆ పాట చూసేందుకు రాత్రి 2 గంటలకు బయటే పవన్ కళ్యాణ్.. 

Pic credit - Instagram

తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ క్రేజ్, ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన స్టైల్, స్వాగ్‌తో పాటు ఆయన ఆఫ్ స్క్రీన్ నేచర్‌ను కూడా అభిమానులు బాగా లైక్ చేస్తారు

ఆయన కెరీర్‏లోనే తొలిప్రేమ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. నిర్మాతలకు కాసుల పంట కురిపించింది. పవన్ ఇమేజ్‌కు ఓ రేంజ్‌కు చేర్చింది

ఇందులో కీర్తి రెడ్డి కథానాయికగా నటించింది. ఈ సినిమాతో ఆమెకు గుర్తింపు వచ్చింది. తొలిప్రేమను కల్ట్ క్లాసిక్ మూవీ అని చాలామంది చెబుతూ ఉంటారు. అందుకు చాలా రీజన్స్ ఉన్నాయి 

ఈ సినిమా కోసం పవన్ ఎంతో కష్టపడ్డారట. అంతేకాకుండా ఈ మూవీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారట. తన లుక్ ఇందులో చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఇక సాంగ్స్ గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు 

 ఈ చిత్రంలోని  ఈ మనస్సే సాంగ్ అంటే పవన్ కు చాలా ఇష్టమని డైరెక్టర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అప్పట్లో ఈ పాటను చాలా ఎంజాయ్ చేశారట పవన్. 

అప్పట్లో ఈ పాట చూసేందుకు రాత్రంతా బయట కూర్చొని వెయిట్ చేశారట పవన్. అరె పవన్ అంతలా ఎందుకు వెయిట్ చేశారో నెక్ట్స్ స్లైడ్‌లో చూద్దాం పదండి  

ఈ సాంగ్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట.  అప్పటికే మిడ్ నైట్ అయింది. అయినా ఈ పాట చూసేందుకు రాత్రి 2 గంటల వరకు బయట ఉన్నారట పవన్. అంత ఇష్టం ఈ పాట ఆయనకు  

పాట కోసం రాత్రంతా బల్లపై కూర్చొని వెయిట్ చేశారట. వర్క్ కంప్లీట్ అయిన తర్వాత రాత్రి 2 తర్వాత సాంగ్ చూసి వెళ్లిపోయారట. ఈ పాటను  వినేప్పుడు, చూసేప్పుడు పవన్ ఫేస్‌లో ఎంతో జోష్ కనిపించేదట. ఆ సాంగ్ ఆ తర్వాత ఎంత హిట్టైందో తెలిసిందే