అవకాశాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న హెబ్బా పటేల్..

09 August 2023

Pic Credit - Instagram

అలా ఎలా అనే సినిమాతో తెలుగు సినిమాల్లో తెరంగేట్రం చేసింది హెబ్బా పటేల్. తొలి సినిమాతోనే నటనతో కట్టిపడేసింది. 

సుకుమార్ దృష్టిలో పడి కుమారి 21ఎఫ్ సినిమా ఛాన్స్ అందుకుంది. ఆ సినిమా యూత్ ఫుల్ హిట్ అవడంతో కుమారి హెబ్భా రేంజ్ పెరిగిపోయింది.

హెబ్భా సరైన కథలు ఎంపిక చేసుకుని ఉంటే కచ్చితంగా ఆమె కెరీర్ వేరేలా ఉండేది అని అంటున్నారు విశ్లేషకులు. 

  కానీ ఆ టైం లో తనకు వచ్చిన ప్రతి సినిమా చేస్తూ వెళ్లింది అమ్మడు. దాంతో వరుస ఫ్లాప్ లను అందుకుంది ఈ బ్యూటీ 

ఛాన్స్ లు లేని టైం లో ఎలాగైనా సినిమాల్లో కనిపించాలని కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది హెబ్భా పటేల్.

ఈ క్రమంలో హెబ్భా పటేల్ కూడా డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ఆల్రెడీ అంతకు ముందు ఆహా కోసం మస్తీస్ అనే వెబ్ సీరీస్ చేసింది 

రీసెంట్ గా వ్యవస్థ అనే సీరీస్ చేసింది. కానీ ఈ వెబ్ సిరీస్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది 

ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది హెబ్భా పటేల్. తెలుగులో పెద్ద హీరోల సినిమాల్లో మాత్రం ఛాన్స్ లు అందుకోలేకపోతుంది